BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

తెరుచుకున్న బడులు.. మొదలైన ఫుడ్ పాయిజన్లు!

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Jul, 2026 - 12:46 PM
78 వీక్షణలు

గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 30 మంది విద్యార్థులకు అస్వస్థత

తెలంగాణలోని బీర్కూర్లో ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. కలుషిత ఆహారం తినడంతో సుమారు 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

రోజువారీ మాదిరిగానే రాత్రి భోజనం చేసిన అనంతరం విద్యార్థులు ఒక్కసారిగా తీవ్ర కడుపునొప్పి, వాంతులు, విరోచనాలతో బాధపడడం ప్రారంభించారు. అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది వెంటనే బాధిత విద్యార్థులను బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనతో ఆందోళనకు గురైన విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగిన వంట నూనెను పదేపదే వినియోగించడం, నాసిరకం ఆహార పదార్థాలను ఉపయోగించడమే ఫుడ్ పాయిజన్‌కు కారణమని వారు ఆరోపిస్తున్నారు.

పాఠశాలల్లో విద్యార్థులకు అందించే ఆహార నాణ్యతపై మరోసారి ప్రశ్నలు తలెత్తగా, ఘటనపై అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం.