BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 07 July 2026, 12:46 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

సాయంత్రానికే మూతపడిన ప్రభుత్వ ఆస్పత్రి..! వైద్య సిబ్బంది గైర్హాజరుతో రోగుల ఆందోళన.. మర్రిచెట్టుపాలెంలో ఉద్రిక్తత

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Jul, 2026 - 12:46 PM
103 వీక్షణలు

పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం మర్రిచెట్టుపాలెం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి వెలుగులోకి వచ్చింది. సోమవారం సాయంత్రం సుమారు 4:50 గంటల సమయంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఓ రోగిని చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకురాగా, అక్కడ వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది ఎవరూ అందుబాటులో లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

డ్యూటీ సమయం ముగియకముందే సిబ్బంది ఆస్పత్రిని వీడి వెళ్లిపోయారని స్థానికులు ఆరోపించారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ ఆస్పత్రిలో సిబ్బంది లేకపోవడం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమేనని మండిపడ్డారు.

వైద్య సేవల కోసం ప్రభుత్వంపై ఆధారపడుతున్న పేద ప్రజలు ఇలాంటి పరిస్థితుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జిల్లా వైద్యాధికారులు వెంటనే స్పందించి విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు ఆస్పత్రిలో వైద్య సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.