BREAKING
thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు thumb ● మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం thumb ● జైలు నుంచి విడుదలైన వాసుదేవ యాదవ్‌కు అఖిల భారత యాదవ మహా సంఘం సంఘీభావం thumb ● తలసాని శ్రీనివాస్ ను కలిసిన అఖిల భారత యాదవ సంఘము సభ్యులు thumb ● చిత్తూరులో వైసీపీ లీగల్ సెల్ టాస్క్‌ఫోర్స్ సమావేశం thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు thumb ● మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం thumb ● జైలు నుంచి విడుదలైన వాసుదేవ యాదవ్‌కు అఖిల భారత యాదవ మహా సంఘం సంఘీభావం thumb ● తలసాని శ్రీనివాస్ ను కలిసిన అఖిల భారత యాదవ సంఘము సభ్యులు thumb ● చిత్తూరులో వైసీపీ లీగల్ సెల్ టాస్క్‌ఫోర్స్ సమావేశం thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
Date of Publish : 07 July 2026, 08:20 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రెడ్డిగూడెం లో వైసీపీ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Jul, 2026 - 08:20 AM
142 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రి, సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలిచిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

పార్టీ మండల అధ్యక్షుడు కుప్పిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, అణగారిన వర్గాల అభ్యున్నతి, దళితుల సాధికారత, సామాజిక సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మహానేత బాబు జగ్జీవన్ రామ్ దేశ రాజకీయ చరిత్రలో చిరస్మరణీయ వ్యక్తిగా నిలిచారని కొనియాడారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే దిశగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పాలనలో పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి అనేక విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేశారని పేర్కొన్నారు.

సామాజిక న్యాయం కోసం బాబు జగ్జీవన్ రామ్ చూపిన మార్గం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం నాయకులు మహానేత సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాల సాధనకు కట్టుబడి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి చాట్ల రాబర్ట్, జిల్లా ఐటీ వింగ్ జనరల్ సెక్రటరీ గుడిసె ప్రభాకర్ రెడ్డి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు మట్టకొయ్య రాము, రెడ్డిగూడెం పార్టీ అధ్యక్షుడు పైడిమర్ల శ్రీనివాసరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబు జగ్జీవన్ రామ్‌కు ఘన నివాళులర్పించారు.