BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 07 July 2026, 12:46 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గోవాలో హనీట్రాప్ హత్య.. మందులో మత్తుమందు కలిపి యువకుడిని చంపిన మహిళ..!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Jul, 2026 - 12:46 PM
135 వీక్షణలు

గోవాలో పరిచయమైన ఓ మహిళతో సరదాగా గడపాలని వెళ్లిన యువకుడు చివరకు హత్యకు గురయ్యాడు. కర్ణాటకలోని మాల్పేకు చెందిన సందీప్ ఎంజాయ్ చేసేందుకు గోవాకు వచ్చాడు. అక్కడ అక్షిత అలియాస్ రూపశ్రీ అనే మహిళను బుక్ చేసుకుని హోటల్‌కు వెళ్లాడు.

హోటల్‌లో ఇద్దరూ కలిసి మద్యం సేవించగా, అక్షిత అతడికి తెలియకుండా మందులో మత్తుమందు కలిపినట్లు పోలీసులు వెల్లడించారు. మత్తులో నిద్రపోయిన సందీప్‌ను హత్య చేసి, అతడి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు, సూట్‌కేస్‌లోని నగదును దోచుకుని పరారైంది.

సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో కేసును ఛేదించిన గోవా పోలీసులు, బెంగుళూరుకు చెందిన అక్షిత అలియాస్ రూపశ్రీని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని మరిన్ని వివరాలపై విచారణ చేపట్టారు.

సరదాగా వెళ్లిన సందీప్‌కు గోవా ట్రిప్ చివరకు ప్రాణాలు తీసిన విషాదంగా మారింది.