BREAKING
thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి thumb ● వావిళ్లపల్లిలో చంద్రయ్య దశదినకర్మ thumb ● రూ.13.50 కోట్లతో నిర్మించిన రోడ్ల నాణ్యతపై చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నలు thumb ● సోషల్ మీడియా పరిచయాలతో జాగ్రత్త thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి thumb ● వావిళ్లపల్లిలో చంద్రయ్య దశదినకర్మ thumb ● రూ.13.50 కోట్లతో నిర్మించిన రోడ్ల నాణ్యతపై చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నలు thumb ● సోషల్ మీడియా పరిచయాలతో జాగ్రత్త
Date of Publish : 20 August 2026, 09:52 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కల్పించాలి

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Aug, 2026 - 09:52 PM
82 వీక్షణలు

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కల్పించాలి: అసెంబ్లీలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి డిమాండ్

అమరావతి వెలగపూడిలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాల్లో జీరో అవర్‌లో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి జర్నలిస్టుల సమస్యలను ప్రస్తావించారు.

ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభంగా నిలిచే జర్నలిస్టులు ప్రజా సమస్యలు, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా ప్రతినిధుల్లో చాలామంది తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారని, సొంత ఇల్లు నిర్మించుకోవడం వారికి భారంగా మారిందన్నారు.

జర్నలిస్టులకు ఆరోగ్య కార్డులు, గృహ నిర్మాణ పథకాలు వంటి సౌకర్యాలు కల్పిస్తే వారి కుటుంబాలకు సామాజిక భద్రత లభిస్తుందని తెలిపారు. గతంలో జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లో జర్నలిస్టు కాలనీలు ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

విభజిత ఆంధ్రప్రదేశ్‌లో జర్నలిస్టులకు గృహ సౌకర్యం కల్పించేందుకు తీసుకొచ్చిన జి.ఓ. నెం. 67, 107లను అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు లేదా గృహ సౌకర్యం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సభ ద్వారా విజ్ఞప్తి చేశారు.