BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 24 August 2026, 12:40 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కాకినాడ నర్సింగ్ విద్యార్థినుల ఘటనపై ఏపీ మహిళా కమిషన్ ఆరా

ఆంధ్రప్రదేశ్
/ కాకినాడ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Aug, 2026 - 12:40 PM
64 వీక్షణలు

కాకినాడ నర్సింగ్ విద్యార్థినుల ఘటనపై ఏపీ మహిళా కమిషన్ ఆరా

మణిపూర్ మహిళా కమిషన్‌తో నిరంతర సంప్రదింపులు.. విద్యార్థినుల భద్రతకు అన్ని చర్యలు

అమరావతి: కాకినాడలో నర్సింగ్ విద్యార్థినులకు సంబంధించిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ స్పందించింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు కమిషన్ ఆరా తీస్తోంది. విద్యార్థినుల భద్రత, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు మహిళా కమిషన్ స్పష్టం చేసింది.

ఈ ఘటన నేపథ్యంలో మణిపూర్ మహిళా కమిషన్‌తో ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, విద్యార్థినుల రక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు మణిపూర్ మహిళా కమిషన్‌కు భరోసా కల్పించింది.

విద్యార్థినుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని ఏపీ మహిళా కమిషన్ వెల్లడించింది.

కాకినాడ నర్సింగ్ విద్యార్థినుల సమస్య పరిష్కారానికి అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని, విద్యార్థినుల క్షేమమే తమ ప్రధాన లక్ష్యమని కమిషన్ పేర్కొంది.