BREAKING
thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి
Date of Publish : 02 August 2026, 09:49 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తోచలక రాయుడిపాలెంలో కాలనీ మధ్యలో భారీ గొయ్యి.. భయాందోళనలో ఎస్సీ కాలనీ వాసులు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Aug, 2026 - 09:49 AM
49 వీక్షణలు

ఏలూరు జిల్లా, చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలం: తోచలకరాయుడుపాలెం గ్రామంలోని పాత ఊరు ఎస్సీ కాలనీ మధ్యలో ఉన్న భారీ గోతిని వెంటనే పూడ్చాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.

గత ప్రభుత్వ హయాంలో గ్రామ సచివాలయం నిర్మాణం కోసం భారీ గోతిని తవ్వినా, అనంతరం నిర్మాణ పనులు చేపట్టకుండా అలాగే వదిలేయడంతో అది ప్రస్తుతం కాలనీవాసులకు శాపంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గోతిలో చెత్తాచెదారం పేరుకుపోవడంతో పాటు పిచ్చి మొక్కలు పెరిగి విషసర్పాలకు నిలయంగా మారిందని తెలిపారు.

చిన్నపాటి వర్షం కురిసినా గోతిలో నీరు నిలిచి దుర్వాసన వెదజల్లుతోందని, దోమలు విపరీతంగా పెరిగి మలేరియా, డెంగ్యూ వంటి విషజ్వరాలు ప్రబలే ప్రమాదం నెలకొన్నదని కాలనీవాసులు తెలిపారు. గోతి కారణంగా చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

గతంలో ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారి గోతిలో పడిపోయిందని, స్థానికులు సకాలంలో గుర్తించి కాపాడడంతో పెను ప్రమాదం తప్పిందని గుర్తు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

గ్రామం నడిబొడ్డున ఉన్న ఈ ప్రమాదకర గోతిని ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణనష్టం జరిగితేనే స్పందిస్తారా అని ప్రశ్నించారు.

చింతలపూడి ఎమ్మెల్యే , స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గోతిని పూడ్చి కాలనీవాసుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.