BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 08 August 2026, 07:56 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కేంద్ర ప్రభుత్వ మెడలు వంచిన జనరేషన్‌ జెడ్‌ ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి మాజీ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Aug, 2026 - 07:56 PM
51 వీక్షణలు

విస్సన్నపేట: కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని మాజీ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు విమర్శించారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్‌ చేశారు.

భారత విద్యార్థి ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ జిల్లా ప్లీనరీ సమావేశాలు విస్సన్నపేటలోని కేపీఆర్‌ కన్వెన్షన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ.. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద జరిగిన పోరాటంలో జనరేషన్‌ జెడ్‌ ఆదర్శవంతమైన ఉద్యమాన్ని నిర్వహించిందన్నారు. సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని కేంద్ర ప్రభుత్వాన్ని గడగడలాడించారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేసే పరిస్థితి తీసుకొచ్చారని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం–2020 ప్రభుత్వ విద్యా వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగించే విధంగా ఉందని లక్ష్మణరావు అన్నారు. విద్యారంగాన్ని కార్పొరేట్‌, ప్రైవేటు సంస్థల చేతుల్లోకి అప్పగించే విధంగా ఈ విధానం ఉందని విమర్శించారు. జాతీయ విద్యా విధానం–2020ను వెంటనే రద్దు చేసి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల్లో కొనసాగుతున్న అధిక ఫీజుల దోపిడీని ప్రభుత్వం అరికట్టాలని కోరారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో జరుగుతున్న అవినీతిని జనరేషన్‌ జెడ్‌ చూస్తూ ఊరుకోదని అన్నారు. అవినీతికి పాల్పడే ప్రభుత్వాలకు కాలం చెల్లుతుందని హెచ్చరించారు.

ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ జిల్లాలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రతినిధులకు సూచించారు. విద్యార్థుల సమస్యలపై ప్లీనరీలో విస్తృతంగా చర్చించి, భవిష్యత్‌ కార్యాచరణను రూపొందించనున్నట్లు తెలిపారు. నూతన జిల్లా కమిటీని ఆదివారం ఎన్నుకోనున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సీహెచ్‌ వెంకటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు ప్రణయ్‌ తేజ, కాజు, షణ్ముఖ్‌, కుమార్‌ నాయక్‌, విస్సన్నపేట మండల నాయకులు ధావన్‌ నాయక్‌, శశాంక్‌, భార్గవ్‌, రాము తదితరులతో పాటు వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు.