BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 16 August 2026, 07:01 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కలుషిత నీటితో అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Aug, 2026 - 07:01 AM
58 వీక్షణలు

కలుషిత నీటితో అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

జంగారెడ్డిగూడెం శివారు పి. అంకంపాలెం గ్రామంలో కలుషిత నీరు తాగడం వల్ల 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ వెంటనే స్పందించారు.

శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో టీవీ ఛానల్‌లో వచ్చిన వార్తను తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రి వైద్యులను ఫోన్ ద్వారా సంప్రదించి, అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

శనివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ముగిసిన అనంతరం ఎమ్మెల్యే నేరుగా జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

ఆసుపత్రిలో ఉన్న డీఎంహెచ్‌ఓతో పాటు వైద్య బృందానికి విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పూర్తిగా కోలుకునే వరకు నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. విద్యార్థులు సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్న అనంతరం క్షేమంగా ఇళ్లకు పంపించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.