BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 03 August 2026, 08:46 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కూటమి పాలనపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు: కొలుసు పార్థసారథి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Aug, 2026 - 08:46 PM
64 వీక్షణలు

కూటమి పాలనపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు: కొలుసు పార్థసారథి

పెండింగ్ ఇళ్ల బిల్లులు త్వరగా విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు

నూజివీడు, ఆగస్టు 3: నూజివీడు పట్టణంలోని 13, 14 వార్డుల్లో నిర్వహించిన డోర్ టు డోర్ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి గత రెండేళ్లలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు.

ప్రజలు వినిపించిన సమస్యలపై వెంటనే స్పందించిన మంత్రి సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాగునీటి సమస్యను అత్యవసరంగా పరిష్కరించాలని, పింఛన్లు, తల్లికి వందనం పథకం అందని వారి వివరాలను పరిశీలించి అర్హులకు త్వరగా అందేలా చూడాలని సూచించారు.

ఇళ్లు నిర్మించుకుని పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేయాలని, టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు మౌలిక వసతులు పూర్తి చేసి వచ్చే ఎనిమిది నెలల్లో ఇళ్లను అందజేస్తామని హామీ ఇచ్చారు.

డ్రైనేజీ, విద్యుత్ బిల్లులు, గ్యాస్ పథకం, ఇతర సంక్షేమ పథకాల అమలులో ఉన్న సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు మంత్రి సూచించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడం, ఇంకా అందని పథకాలను అర్హులకు చేరవేయడమే డోర్ టు డోర్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని చెప్పారు.

గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైందని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ప్రజల నుంచి నేరుగా సమస్యలు తెలుసుకుని వాటిని వేగంగా పరిష్కరించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు.

ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.