BREAKING
thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి
Date of Publish : 19 August 2026, 06:13 am
Posted by : PAMMI NAVEENKUMAR

తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి

ఆంధ్రప్రదేశ్
Reporter
pammi naveenkumar రావులపాలెం మండల ప్రతినిధి
19 Aug, 2026 - 06:13 AM
55 వీక్షణలు

తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అణగదొక్కేందుకు కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు: చిర్ల జగ్గిరెడ్డి

ఆలమూరు: ఆలమూరు మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, చెముడులంక మాజీ సర్పంచ్ తమ్మన శ్రీనివాస్ మరియు ఆయన కుటుంబ సభ్యులను డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పరామర్శించారు. తమ్మన శ్రీనివాస్ మరియు ఆయన కుటుంబ సభ్యులపై కూటమి ప్రభుత్వం నమోదు చేసిన కేసులు, అరెస్టులను ఆయన తీవ్రంగా ఖండించారు.


ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను తట్టుకోలేక, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రజల కోసం పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు నమోదు చేస్తూ భయపెట్టే ప్రయత్నం చేస్తోందని చిర్ల జగ్గిరెడ్డి ఆరోపించారు.


తమ్మన శ్రీనివాస్ సర్పంచ్‌గా పనిచేసిన సమయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, ఆయన భార్య తమ్మన సుబ్బలక్ష్మి ఆలమూరు మండల మార్కెటింగ్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ ప్రజలకు సేవ చేశారని తెలిపారు. అలాంటి కుటుంబాన్ని రాజకీయ కక్ష సాధింపులో భాగంగా కేసులు, అరెస్టులతో వేధించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు.


బ్రిడ్జిలకు పేర్లు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తే కేసులా?


బడుగువానిలంక, మూలస్థానం వద్ద నిర్మించిన రెండు బ్రిడ్జిలకు సంబంధించి గతంలో వైఎస్సార్ హయాంలో మంజూరైన నిధులతో అభివృద్ధి పనులు జరిగాయని చిర్ల జగ్గిరెడ్డి గుర్తుచేశారు. అప్పటి ఎమ్మెల్యే బిక్కిన కృష్ణాజిన చౌదరి శంకుస్థాపన చేసిన సమయంలో తాను కూడా ఎమ్మెల్యేగా పాల్గొన్నానని తెలిపారు.


ప్రభుత్వ నిధులతో ప్రజల కోసం నిర్మించిన బ్రిడ్జిలకు వ్యక్తిగత పేర్లు పెట్టే ప్రయత్నాలపై రెండు గ్రామాల ప్రజల్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని పేర్కొన్నారు. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ఈ అంశంపై తమ్మన శ్రీనివాస్ ప్రశ్నించడం, ఫిర్యాదు చేయడం ఎలా నేరమవుతుందని చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నించారు. ప్రజల తరఫున ప్రశ్నించిన నాయకుడిపై కక్షతో కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు.


చట్టపరంగా పోరాడి శ్రీనివాస్‌ను ఇంటికి తీసుకొస్తాం


తమ్మన శ్రీనివాస్‌పై విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో కేసు నమోదు చేసి, అనంతరం మరిన్ని కేసులు మోపే ప్రయత్నం చేశారని చిర్ల జగ్గిరెడ్డి ఆరోపించారు. కోర్టును కూడా తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించి 14 రోజుల రిమాండ్‌కు పంపించే పరిస్థితి తీసుకువచ్చారని అన్నారు.


తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తనపై గతంలో ఏడు, ఎనిమిది కేసులు పెట్టినా రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత కక్షతో ఒక్క కేసు కూడా పెట్టలేదని తెలిపారు. రాజకీయాలు ఉంటే తనతో చేయాలని, తన కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నాయకులను లక్ష్యంగా చేసుకోవడం రాజకీయ హుందాతనం కాదన్నారు.


తమ్మన శ్రీనివాస్ ఎలాంటి తప్పు చేయలేదనే నమ్మకంతో ధైర్యంగా చట్టం ముందు నిలబడ్డారని చెప్పారు. అవసరమైతే పైకోర్టులను ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తామని, బెయిల్ కోసం చట్టపరమైన అన్ని మార్గాలను అనుసరిస్తామని స్పష్టం చేశారు.


కార్యకర్తల కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ అండ


అక్రమ కేసులు, అరెస్టులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను భయపెట్టడం కూటమి ప్రభుత్వానికి సాధ్యం కాదని చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. కార్యకర్తల కుటుంబాలను కూడా రాజకీయ వేధింపులకు గురిచేయడం అత్యంత దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు.


తమ్మన శ్రీనివాస్‌తో పాటు అరెస్టయిన కుటుంబ సభ్యులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని, న్యాయపోరాటం చేసి వీలైనంత త్వరగా వారిని కేసుల నుంచి బయటకు తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.


రాజకీయ కక్ష సాధింపులకు స్వస్తి పలికి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని చిర్ల జగ్గిరెడ్డి సూచించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.

అక్రమ కేసులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, పార్టీ నాయకులు, కార్యకర్తలను ఎవరూ అణగదొక్కలేరని, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందని చిర్ల జగ్గిరెడ్డి స్పష్టం చేశారు. తమ్మన శ్రీనివాస్ మరియు ఆయన కుటుంబ సభ్యులకు న్యాయం జరిగే వరకు న్యాయపరంగానూ, రాజకీయంగానూ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.