క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న జరిగిన జైలు భరో ను జయప్రదం చేద్దాం - citu
హైదరాబాద్ ఆగస్టు 07 ఏన్ టుడే న్యూస్.
అంబర్పేట జోన్ కోరంటి చౌరస్తా దగ్గర కార్మికులకు కరపత్రాలు పంచుతూ ఈ సందర్భంగా
సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్పోరేట్ అనుకూల కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను మరింత వేగవంతం చేస్తూ ఎందరో పోరాట యోధుల ప్రాణ త్యాగాలతో సాధించుకున్న దేశ స్వాతంత్రాన్ని విదేశీ సంస్థలకు తాకట్టు పెడుతు నాడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్రం కోసం సాగిన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కార్పొరేట్, పెట్టుబడిదారులకు, మతోన్మాదులకు, వ్యతిరేకంగా నేడు కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలు ప్రజలు ప్రజాతంత్ర వాదులు క్విట్ ఇండియా ఉద్యమస్ఫూర్తితో ఆగస్టు 10న జరిగే రాష్ట్రవ్యాప్త గా జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
బిజెపి ప్రభుత్వ నయా ఉదారవాద సంస్కరణలను దూకుడుగా అమలు చేస్తూ, లేబర్ కోడ్ అమలకై ఫైనల్ రూల్స్ నోటిఫికేషన్ పెట్టుబడిదారులకు లాభం చేకూర్చే విధంగా *ఈస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్* పేరుతో అధిక లాభాలు కోసం కార్మికులను ఎనిమిది గంటల పని నుంచి 12 గంటలకు పెంచుకునేందుకు యజమాన్యాలకు పూర్తి స్వేచ్ఛ నిచ్చారు. సమ్మె హక్కును కాళరాత్రి కార్మిక సంఘాల గుర్తింపు రిజిస్ట్రేషన్ కష్టతరం చేస్తూ ఉద్యోగ భద్రతకు పాత్ర వేశారు. 300 మంది లోపు పని చేసే కంపెనీలలో కార్మికులను ఎప్పుడైనా నోటీసు లేకుండా తొలగించేందుకు హైర్ & ఫైర్ విధానాన్ని తీసుకొచ్చారు. వేతనా ల కోడ్ లో కనీసం వేతనాలు నిర్ణయించి విధానానికి మంగళం పాడారు, సామాజిక భద్రత కోడ్, వృత్తి సంబంధిత రక్షణ ఆరోగ్యం పని పరిస్థితుల కోడ్స్, తో భవన నిర్మాణం హమాలీ, ట్రాన్స్పోర్ట్, బీడీ, దగ్గర అసంఘటిత రంగా కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలేశారు పిఎఫ్ ఈ,ఎస్,ఐ వెల్ఫేర్ బోర్డుల పై గొడ్డలి పెట్టు వేశారు వీరు ఉద్యోగ భద్రత కనీస వేతనాని కి నమస్కరించి లేబర్ కోడ్స్ అమలు అయితే తరతరాలుగా పోరాట సాధించుకునే హక్కులు కార్మిక లోకం పూర్తిగా కోల్పోతార నీ విమర్శించారు. మరొకవైపు అమెరికా, బ్రిటన్, న్యూజిలాండ్, కేంద్ర ప్రభుత్వం స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు చేసుకొని భారత వ్యవసాయరంగానికి 32 దేశాల నుండి విత్తనాలు జీరో సుంకాలతో దిగుమతి చేసుకోవడంతో దేశీయ వ్యవసాయ పూర్తిగా పరిస్థితులు తీసుకొస్తున్నారు వామపక్ష పోరాటాల ఫలితంగా 2005లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి గ్యారెంటీ చట్టం రూపొందింది దీని ప్రకారం వ్యవసాయ కార్మికులకు సంవత్సరంలో వంద రోజులు పని కల్పించారు కానీ ప్రస్తుతం, ఈ చట్టాన్ని రద్దుచేసి *వి,బీ,జీ, రాం,జీ,* గా పేరు మార్చి రాష్ట్రాల వాటను 40 శాతానికి పూర్తిగా పెంచి కేంద్రం కేంద్రం వాటాను 60 శాతానికి తగ్గించు కుంటుంది పేదల పొందుతున్న అంత్యోదయ ఆహార భద్రత కార్డు పై ఇప్పటివరకు 35 కేజీల బియ్యాన్ని తీసుకుంటున్న పేదలు దాన్ని పూర్తిగా రద్దుచేసి ఏడు కిలోల కే పరిమితం చేస్తుంది. అలాగే విద్యుత్ ఉత్పత్తి రాజ్యాంగ ప్రకారం రాష్ట్ర జాబితాలో ఉన్నది కానీ దాని గత పార్లమెంటులో 2025 విద్యుత్ సవరణ బిల్లు గా ఆమోదించి విద్యుత్తు పంపిణీ బాధ్యతలు కూడా కేంద్రం చూస్తున్నది విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ద్వారా స్మార్ట్ మీటర్లు పెట్టి ముందుగానే టారిఫ్ వసూలు చేస్తున్నారు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఉచిత విద్యుత్ పూర్తిగా రద్దు చేసే ప్రమాదం ఏర్పడుతుంది పేదలకు వ్యవసాయ కార్మికులకు ఉచితంగా సరఫరా చేసే విద్యుత్ పూర్తిగా నిలిచిపోతుంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా ఆగస్టు పదిన జరిగే జైలు భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు నగర అధ్యక్షులు ఎం దశరథ్, నగర కోశాధికారి అజయ్ బాబు, నగర ఉపాధ్యక్షులు జి.రాములు, సిఐటియు జోన్ నాయకులు బి.లక్ష్మణ్, పి.శ్రీనివాస్, మున్సిపల్ వర్కర్లు లక్ష్మమ్మ, స్వప్న, తదితరులు పాల్గొన్నారు.