BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 13 September 2026, 07:17 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

లింగపాలెం మండలం లో చర్మకారులకు విశ్వకర్మ యోజన కిట్ల పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Sep, 2026 - 07:17 PM
43 వీక్షణలు

ధర్మాజీగూడెం: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ద్వారా చేతివృత్తిదారులకు ప్రోత్సాహం అందుతోంది. ఇందులో భాగంగా ఏలూరు జిల్లా లింగపాలెం మండలానికి చెందిన ఎస్సీ వర్గానికి చెందిన పలువురు చర్మకారులు మూడు నెలల పాటు శిక్షణ పొందగా, వారికి అవసరమైన పనిముట్లు, సామగ్రితో కూడిన కిట్లను కేంద్ర ప్రభుత్వం అందించింది. లింగపాలెం మండలానికి చెందిన తాళ్లూరి కుమార్, పొదిల జేమ్స్ రాజుతో పాటు పలువురు చర్మకారులకు ఈ కిట్లను అందజేశారు. ధర్మాజీగూడెంలో నిర్వహించిన కార్యక్రమంలో లింగపాలెం మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండారు సత్యనారాయణ, రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యుడు చక్రధర్ రావు, భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్బారావు, మండల ప్రధాన కార్యదర్శి శ్రీకాకొల్లు వెంకట నాగేశ్వరావు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ధర్మాజీగూడెం పోస్టుమాస్టర్ హాజరై శిక్షణ పొందిన చర్మకారులకు కిట్లను అందజేశారు. విశ్వకర్మ యోజన ద్వారా సంప్రదాయ చేతివృత్తిదారులకు శిక్షణతో పాటు అవసరమైన పనిముట్లు అందించడం ద్వారా వారి వృత్తి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తోడ్పడుతోందని నాయకులు తెలిపారు.