బాధలో ఉన్న కుటుంబాన్ని పరామర్శించిన లింగాల కమల్ రాజు
తెలంగాణ
/
ఖమ్మం
తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా
మధిర మండలం, ఇల్లూరు గ్రామంలో అకాల మరణం చెందిన వరదబోయిన శ్రీనివాసరావు కుటుంబాన్ని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు పరామర్శించారు. కుటుంబంలో అకస్మాత్తుగా జరిగిన మరణంతో విషాదంలో ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ధైర్యం చెప్పారు. ఈ కష్ట సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పిస్తూ మనోధైర్యాన్ని నింపారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు,,బొగ్గుల భాస్కర్ రెడ్డి , ఉమామహేశ్వర్ రెడ్డి , వంకాయలపాటి నాగేశ్వరరావు ,, మెట్టల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.