BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 23 August 2026, 06:22 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మాదాపూర్ అంజయ్య నగర్‌లో ఘోరం.. కుప్పకూలిన ఏడంతస్తుల భవనం

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 06:22 AM
76 వీక్షణలు

మాదాపూర్ అంజయ్య నగర్‌లో ఘోరం.. కుప్పకూలిన నాలా పక్కన 50 గజాల్లో నిర్మించిన ఏడంతస్తుల భవనం.

హైదరాబాద్‌ మాదాపూర్‌ పరిధిలోని అంజయ్య నగర్‌లో నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. నాలా పక్కనే కేవలం 50 గజాల స్థలంలో నిర్మిస్తున్న ఈ భవనం కూలిపోవడంతో తీవ్ర కలకలం రేగింది. 

భవనం కూలిన శిథిలాలు పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌పై పడటంతో ఆ భవనం కూడా దెబ్బతింది. సమీపంలోని భవనాల్లో ఉన్న పలువురు భయాందోళనకు గురయ్యారు. కొందరికి గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. 

కేవలం 50 గజాల స్థలంలో ఇంత పెద్ద బహుళ అంతస్తుల భవనం నిర్మాణానికి అనుమతులు ఎలా వచ్చాయంటూ స్థానికులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలా పక్కనే ఇలాంటి నిర్మాణాలు చేపట్టడంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. 

ప్రమాద స్థలానికి సహాయక బృందాలు చేరుకుని శిథిలాల తొలగింపు పనులు చేపట్టాయి. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.