BREAKING
పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE
Date of Publish : 05 September 2026, 04:05 pm
Posted by : కూనురు మధు

మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి హౌస్ అరెస్ట్

తెలంగాణ
/ నల్గొండ
05 Sep, 2026 - 04:05 PM
27 వీక్షణలు


 ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నకిరేకల్‌ నియోజకవర్గ పర్యటన నేపథ్యంలో పోలీసులు మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నాయకుడు చిరుమర్తి లింగయ్యను ముందస్తుగా హౌస్‌ అరెస్ట్‌ చేశారు. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగానే ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. అయితే తనను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించడంపై చిరుమర్తి లింగయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను ముందుగా నిర్ణయించుకున్న పలు శుభకార్యాలకు హాజరు కావాల్సి ఉందని, తనను బయటకు వెళ్లేందుకు అనుమతించాలని పోలీసులను కోరారు. ఈ క్రమంలో పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు.  సీఎం పర్యటన పూర్తయ్యే వరకు బయటకు వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేసినట్లు తెలిసింది. దీంతో కొద్దిసేపు ఆయనకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. మరోవైపు సీఎం పర్యటన నేపథ్యంలో నకిరేకల్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు ముఖ్య నాయకులను పోలీసులు ముందస్తుగా అప్రమత్తం చేశారు. ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకోకుండా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. సీఎం పర్యటన ముగిసే వరకు పోలీసుల నిఘా కొనసాగనున్నట్లు తెలుస్తోంది.