మానవతా దృక్పథంతో దుప్పట్ల పంపిణీ చేసిన పద్మ సుగుణ చారిటబుల్ ట్రస్ట్..
మానవతా దృక్పథంతో దుప్పట్ల పంపిణీ చేసిన పద్మ సుగుణ చారిటబుల్ ట్రస్ట్..
అన్నమయ్య జిల్లా.
పుంగనూరు.
పద్మ సుగుణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద మరియు నిరుపేద కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పాల్గొని అవసరమైన వారికి దుప్పట్లు అందజేశారు.
సభ్యులతో కలసి దువ్వాల వాండ్ల ఇండ్లు వద్ద నిరు పేదలకు దుప్పట్లు పంపిణి చేయడం జరిగింది.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతు తమ అమ్మమ్మ, తల్లి జ్ఞాపకార్థం గత సంవత్సరం పద్మ సుగుణ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని ఈ ట్రస్ట్ ద్వారా కుల మతాల కు అతీతంగా నిరు పేదలకు నిస్వార్ధ సేవలు అందించాలనె సదుద్యేస్యం తో ఇప్పటి వరకు నిరు పేదలతో సహా బంతి బోజనము,బెడ్ షీట్ ల పంపిణి పేద లుగా మరణించిన వారికీ దహన సంస్కారాలకు ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం,రోగులకు బ్రెడ్డు,పండ్లు పంపిణి వంటి కార్యక్రమాలు చేస్తున్నారు.ఈ కార్యక్రమాలకు పూర్తిగా మా కుటుంబ సభ్యులు తమ జీతం లో ప్రతి నెల పది శాతం వెచ్చించి సొంత సొమ్ము వినియోగించడం జరుగుతున్నాదని, ఇందులో ఎటువంటి ఇతరత్ర సంస్థలు కానీ విదేశాల నుండి ఆర్థిక సాయం కానీ సంబంధం లేదని తెలిపారు. కార్యక్రమం లో కార్యదర్శి కృపాకర, సభ్యులు మునిరజ తదితరులు పాల్గొన్నారు.సమాజ సేవే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని స్థానికులు అభినందించారు.