BREAKING
అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE గ్రామ సచివాలయ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేత గోవర్ధన్ రెడ్డి పుంగనూరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE గ్రామ సచివాలయ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేత గోవర్ధన్ రెడ్డి పుంగనూరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ
Date of Publish : 05 September 2026, 11:24 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మధిరలో ఘనంగా వాసవి మాతకు గాజుల అలంకరణ భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు..

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Sep, 2026 - 11:24 AM
15 వీక్షణలు

మధిరలో ఘనంగా వాసవి మాతకు గాజుల అలంకరణ భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు.. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం

మధిర, సెప్టెంబరు 5: తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని మధిర శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా వాసవి మాతకు గాజుల అలంకరణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసులు శేషాచార్యులు ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.

ఈ సందర్భంగా లలిత పారాయణ కమిటీ, మధిర ఆధ్వర్యంలో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గాజులతో సుందరంగా అలంకరించిన వాసవి మాతను దర్శించుకునేందుకు మహిళలు, భక్తులు, దేవాలయ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

అమ్మవారి దర్శనం, ప్రత్యేక పూజలు, విష్ణు సహస్రనామ పారాయణంతో ఆలయ ప్రాంగణం భక్తి భావంతో మార్మోగింది. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు అమ్మవారి ఆశీస్సులు పొందారు.