BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 24 August 2026, 05:45 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మధిరలో జూనియర్ సివిల్ జడ్జికి ఘన వీడ్కోలు.. పదోన్నతిపై గద్వాలకు బదిలీ

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Aug, 2026 - 05:45 PM
103 వీక్షణలు

మధిర: తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని మధిర కోర్టు ప్రాంగణంలో అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వహించిన నిష్కా పాత్రుడుకు సోమవారం ఘన వీడ్కోలు సభ నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జిగా పదోన్నతి పొంది, గద్వాల జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శిగా బదిలీపై వెళ్తున్న సందర్భంగా మధిర బార్ అసోసియేషన్, ప్రాసిక్యూషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ వీడ్కోలు కార్యక్రమానికి మధిర కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీప్తి వేముల ముఖ్య అతిథిగా హాజరై నిష్కా పాత్రుడు అందించిన న్యాయ సేవలను కొనియాడారు. న్యాయ వ్యవస్థలో అంకితభావంతో పనిచేసి, ప్రజలకు న్యాయం అందించడంలో ఆమె చేసిన సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఏపీపీ జన్ను భద్రయ్య, మధిర బార్ అసోసియేషన్ అధ్యక్షులు చావలి రామరాజు, సీనియర్ న్యాయవాదులు వాసిరెడ్డి వెంకటేశ్వరరావు, వాసంశెట్టి కోటేశ్వరరావు, చింతల గోపాల్, కట్టా పూర్ణ చంద్రరావు, పుల్లారావు, నెల్లూరి రవి, అబ్రహాం, జ్ఞానేష్, గంధం శ్రీనివాస్, సునీత, మాధురి, సంధ్య వెంకట్రావు, సతీష్, రమేష్ తదితరులు పాల్గొని న్యాయమూర్తిని ఘనంగా సత్కరించారు.

అలాగే మూడు కోర్టులకు చెందిన సిబ్బంది, కోర్టు పోలీసు సిబ్బంది, న్యాయవాదుల గుమస్తాలు పాల్గొని నిష్కా పాత్రుడికి పుష్పగుచ్ఛాలు అందజేసి పదోన్నతిపై శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నిష్కా పాత్రుడు న్యాయ సేవల పట్ల చూపిన నిబద్ధత, క్రమశిక్షణ, అంకితభావం అందరికీ ఆదర్శమని అన్నారు. ఆమె భవిష్యత్ న్యాయ సేవా ప్రస్థానం మరింత విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.

మధిర బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, ఏపీపీ, కోర్టు పోలీసు సిబ్బంది పాల్గొని నిష్కా పాత్రుడికి ఆత్మీయ వీడ్కోలు పలికారు.