BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 24 August 2026, 05:45 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మధిరలో మిర్చి వ్యాపారులు, కోల్డ్ స్టోరేజ్ యజమానులతో మార్కెట్ కమిటీ కీలక సమావేశం

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Aug, 2026 - 05:45 PM
63 వీక్షణలు

ట్రేడింగ్ లైసెన్సులు తప్పనిసరిగా పొందాలి : మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు

మధిర, ఖమ్మం జిల్లా :

మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో మిర్చి వ్యాపారాలు నిర్వహిస్తున్న వ్యాపారులు, కోల్డ్ స్టోరేజ్ యజమానులతో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మార్కెట్ నిబంధనలు, వ్యాపార కార్యకలాపాల నిర్వహణపై కీలకంగా చర్చించారు.

ఈ సందర్భంగా చైర్మన్ బండారు నరసింహారావు మాట్లాడుతూ మధిర మార్కెట్ కమిటీ పరిధిలో మిర్చి వ్యాపారం నిర్వహించే ప్రతి వ్యాపారి, కోల్డ్ స్టోరేజ్ యజమాని తప్పనిసరిగా ట్రేడింగ్ లైసెన్స్ పొందాలని సూచించారు. మార్కెట్ నిబంధనలకు అనుగుణంగా లైసెన్స్ పొందిన తర్వాతే వ్యాపార కార్యకలాపాలు కొనసాగించాలని స్పష్టం చేశారు.

వ్యవసాయ మార్కెట్ వ్యవస్థను మరింత పటిష్టంగా నిర్వహించేందుకు, రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు వ్యాపారులు మార్కెట్ కమిటీ నిబంధనలను పాటించాలని ఆయన కోరారు. అనధికారిక వ్యాపార కార్యకలాపాలకు తావులేకుండా నిబంధనల ప్రకారం అన్ని కార్యకలాపాలు జరగాలని సూచించారు.

సమావేశంలో పాల్గొన్న మిర్చి వ్యాపారులు, కోల్డ్ స్టోరేజ్ యజమానులు మార్కెట్ కమిటీ సూచనలను అంగీకరించారు. నిబంధనల ప్రకారం ట్రేడింగ్ లైసెన్సులు పొందేందుకు తమ పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.

ఈ సమావేశంలో కోల్డ్ స్టోరేజ్ తనిఖీ బృందం టీమ్ లీడర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీనియర్ మార్కెటింగ్ అసిస్టెంట్ జె. నరేందర్, తనిఖీ బృందం సభ్యులు, మార్కెట్ కమిటీ సిబ్బంది, మిర్చి వ్యాపారులు, కోల్డ్ స్టోరేజ్ యజమానులు పాల్గొన్నారు.