మధిరలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలకు ఘన సత్కారం
మధిర: తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిరలో మంగళవారం మదర్ థెరిస్సా సేవాసదనం ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలను ఘనంగా సన్మానించారు. విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తూ, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయుల సేవలను గుర్తిస్తూ ఈ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందుకున్న లీలా విజయ్, సాధినేని రాజేశ్వరి, జ్యోతి, ఊస రమాదేవి, భిక్షాలు తదితరులను పలువురు ప్రముఖులు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. విద్యారంగంలో వారు అందిస్తున్న విశిష్ట సేవలు, అంకితభావం, నిబద్ధతకు గుర్తింపుగా లభించిన ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలు వారి జీవితంలో మరెన్నో విజయాలకు నాంది కావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో వారణాసి కళావతి, విశ్రాంత ఎంపీడీవో మాధవరపు నాగేశ్వరరావు, సామాజిక సేవకులు పుల్లఖండం సత్యనారాయణమూర్తి, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు సెట్టిపోగు రాము, మదర్ థెరిస్సా సేవాసదనం నిర్వాహకులు స్వర్ణలత సుందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.