BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 23 August 2026, 06:47 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మెదక్‌లో కాంగ్రెస్ పీఏసీ సమావేశం.. భారీగా తరలిరావాలని నేతల పిలుపు

తెలంగాణ
/ మేడక్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 06:47 PM
52 వీక్షణలు

మెదక్‌లో కాంగ్రెస్ పీఏసీ సమావేశం.. భారీగా తరలిరావాలని నేతల పిలుపు

మోటార్ సైకిల్ ర్యాలీతో నాయకులకు స్వాగతం

మెదక్, ఆగస్టు 23:

ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం సోమవారం మెదక్ పట్టణంలో నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు పట్టణంలోని వినాయక ఫంక్షన్ హాల్‌లో ఈ సమావేశం జరగనుంది.

ఈ సమావేశానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్, పార్లమెంట్ సభ్యుడు సురేష్ షెట్కర్, ఎమ్మెల్యే పి. సంజీవరెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ తదితర ముఖ్య నేతలు హాజరుకానున్నారు.

సమావేశం సందర్భంగా మెదక్ పట్టణంలోని నర్సాపూర్ రోడ్డులో ఉన్న వెల్‌కమ్ బోర్డు నుంచి వినాయక ఫంక్షన్ హాల్ వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, కోఆప్షన్ సభ్యులు, యువజన, మహిళా విభాగాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని మెదక్ పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మందుగుల గంగాధర్ కోరారు.

ఈ సమావేశానికి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు హాజరు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.