BREAKING
thumb ● అర్హత లేని ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి thumb ● సింగరేణి గుడిసెల్లో సినిమా షూటింగ్ సందడి శరవేగంగా నూతన చిత్రం చిత్రీకరణ thumb ● SIRపై కాంగ్రెస్ వైఖరిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు విమర్శించారు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● అర్హత లేని ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి thumb ● సింగరేణి గుడిసెల్లో సినిమా షూటింగ్ సందడి శరవేగంగా నూతన చిత్రం చిత్రీకరణ thumb ● SIRపై కాంగ్రెస్ వైఖరిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు విమర్శించారు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక
Date of Publish : 15 August 2026, 05:11 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మెట్టగుట్ట శేషాచల శ్రీనివాసస్వామి ఆలయానికి లక్ష రూపాయల విరాళం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Aug, 2026 - 05:11 PM
59 వీక్షణలు

మెట్టగుట్ట శేషాచల శ్రీనివాసస్వామి ఆలయానికి లక్ష రూపాయల విరాళం

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామ సరిహద్దుల్లో ఉన్న మెట్టగుట్ట శేషాచల శ్రీనివాసస్వామి దేవస్థానానికి ఓ దాత లక్ష రూపాయల విరాళం అందజేశారు.

పెనుగొలను గ్రామపంచాయతీ పరిధిలోని చల్లగుండ్లవారిపాలెం గ్రామానికి చెందిన ఉప్పెల నాగిరెడ్డి, కృష్ణవేణి దంపతులు శనివారం ఆలయ చైర్మన్ పంది వెంకట్రావుకు ఈ విరాళాన్ని అందించారు. ఈ మొత్తాన్ని దేవస్థానం కళ్యాణ మండపం నిర్మాణానికి వినియోగించాలని దాతలు తెలిపారు.

ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న ఉప్పెల నాగిరెడ్డి దంపతులను ప్రధానార్చకులు తూమాటి శ్యామ సుందర శ్రీనివాసాచార్యులు వేదమంత్రాలతో ఆశీర్వదించి, శేషవస్త్రంతో సత్కరించారు.

దేవస్థాన అభివృద్ధికి విరాళం అందించిన దాతలకు ఆలయ సభ్యులు ఎన్. శ్రీనివాసరావు, ఆర్. వెంకటసుబ్బారావు కృతజ్ఞతలు తెలిపారు.