BREAKING
thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● హత్య, అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు thumb ● ప్రజలకు అందుబాటులో ఉంటా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా thumb ● డిండి ప్రాజెక్టుపై డీకే అరుణ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమే: జక్కలి రాజు యాదవ్ thumb ● మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులు లేదు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రాన్ని సందర్శించిన వేముల వీరేశం thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● హత్య, అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు thumb ● ప్రజలకు అందుబాటులో ఉంటా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా thumb ● డిండి ప్రాజెక్టుపై డీకే అరుణ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమే: జక్కలి రాజు యాదవ్ thumb ● మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులు లేదు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రాన్ని సందర్శించిన వేముల వీరేశం
మంచి మాట
Date of Publish : 26 October 2026, 09:52 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌కు ఆహ్వానం

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Oct, 2026 - 09:52 PM
17 వీక్షణలు
  •  డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రతిష్టాత్మక సదస్సు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడం, పారిశ్రామిక అభివృద్ధికి కొత్త అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌’కు హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఆహ్వానించారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీకి సంబంధించిన అంశంపై జరిగిన సమావేశం అనంతరం రేవంత్ రెడ్డి, తెలంగాణలో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ వివరాలను ఫడ్నవీస్‌కు వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక సదస్సులో పాల్గొనాలని కోరారు. దీనిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సానుకూలంగా స్పందించారు. సదస్సులో పాల్గొనేందుకు తనకు ఆసక్తి ఉందని, హాజరయ్యేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. ఈ సదస్సు ద్వారా తెలంగాణలో పెట్టుబడులకు మరింత ఊతం లభించడంతో పాటు పారిశ్రామిక రంగంలో కొత్త భాగస్వామ్యాలకు అవకాశాలు ఏర్పడనున్నాయి.