BREAKING
thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● హత్య, అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు thumb ● ప్రజలకు అందుబాటులో ఉంటా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా thumb ● డిండి ప్రాజెక్టుపై డీకే అరుణ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమే: జక్కలి రాజు యాదవ్ thumb ● మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులు లేదు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రాన్ని సందర్శించిన వేముల వీరేశం thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● హత్య, అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు thumb ● ప్రజలకు అందుబాటులో ఉంటా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా thumb ● డిండి ప్రాజెక్టుపై డీకే అరుణ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమే: జక్కలి రాజు యాదవ్ thumb ● మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులు లేదు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రాన్ని సందర్శించిన వేముల వీరేశం
మంచి మాట
Date of Publish : 26 October 2026, 09:52 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

45 పైసలకే రూ.10 లక్షల బీమా..

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Oct, 2026 - 09:52 PM
24 వీక్షణలు
  • రేపటి నుంచే కొత్త విధానం ఆఫ్‌లైన్ టికెట్లు కొనేవారికీ ప్రయాణ బీమా.. డిజిటల్ చెల్లింపుల ద్వారానే అవకాశం

రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం కీలక సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. రైల్వే బోర్డు నిర్ణయం ప్రకారం అక్టోబర్ 27 నుంచి రైల్వే టికెట్ కౌంటర్లలో ఆఫ్‌లైన్‌లో టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికులకు కూడా రూ.10 లక్షల వరకు ప్రయాణ బీమా పొందే అవకాశం కల్పించనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ బీమా సదుపాయం తప్పనిసరి కాదు. ప్రయాణ బీమా కావాలనుకునే ప్రయాణికులు టికెట్ కొనుగోలు సమయంలో అదనంగా 45 పైసలు చెల్లించాల్సి ఉంటుంది. కేవలం 45 పైసలకే రూ.10 లక్షల వరకు బీమా రక్షణ పొందే అవకాశం ఉండటంతో ప్రయాణికులకు ఇది ప్రయోజనకరంగా మారనుంది. అయితే, బీమా ప్రీమియం మొత్తాన్ని నగదు రూపంలో స్వీకరించేందుకు అవకాశం ఉండదు. ప్రయాణికులు డిజిటల్ చెల్లింపుల ద్వారానే 45 పైసలు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు అనుగుణంగా టికెట్ కౌంటర్లలో డిజిటల్ చెల్లింపులను స్వీకరించాలని రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇప్పటివరకు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకునే వారికి అందుబాటులో ఉన్న ఈ సదుపాయాన్ని ఆఫ్‌లైన్ ప్రయాణికులకు కూడా విస్తరించడం ద్వారా మరింత మందికి ప్రయోజనం కలగనుంది.