BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 22 August 2026, 01:58 pm
Posted by : గంగుల రాజ్ కుమార్

గణిత–విజ్ఞాన మేళాలో విద్యార్థుల ప్రతిభ

తెలంగాణ
Reporter
గంగుల రాజ్ కుమార్ లక్సెట్టిపేట్ మండల ప్రతినిధి
22 Aug, 2026 - 01:58 PM
224 వీక్షణలు

గణిత–విజ్ఞాన మేళాలో విద్యార్థుల ప్రతిభ

మంచిర్యాల | NTODAY News 

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 41వ డివిజన్‌లో శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన గణిత–విజ్ఞాన మేళా కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన వివిధ సైన్స్ ఫెయిర్ ప్రాజెక్టులను ఆమె ప్రారంభించి పరిశీలించారు. విద్యార్థులు ప్రదర్శించిన సృజనాత్మకత, శాస్త్రీయ ఆలోచనా విధానం, నూతన ఆవిష్కరణలను అభినందించి ప్రోత్సహించారు.

విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకతను పెంపొందించేందుకు ఇలాంటి విజ్ఞాన మేళాలు ఎంతగానో దోహదపడతాయని సురేఖ పేర్కొన్నారు. చదువుతో పాటు పరిశోధనాత్మక ఆలోచనా విధానాన్ని అలవర్చుకుని విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

అనంతరం పాఠశాల నిర్వాహకులు, ఉపాధ్యాయులు, సిబ్బంది కొక్కిరాల సురేఖను శాలువాతో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, కార్పొరేటర్లు షేర్ శ్రీలక్ష్మి–పవన్, సుద్దమల్ల హరికృష్ణ, చిలువేరి జ్యోతి–శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.