BREAKING
​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు
Date of Publish : 08 June 2026, 06:13 pm
Posted by : V శ్రీనివాస్

​ఎన్నికల విధుల బకాయిలు వెంటనే చెల్లించాలి – అదనపు కలెక్టర్‌కు ఫోటోగ్రాఫర్ల వినతి

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
08 Jun, 2026 - 06:13 PM
133 వీక్షణలు

ఎన్నికల సమయంలో విధులు నిర్వహించిన తమకు రావలసిన పెండింగ్ డబ్బులను వెంటనే ఇప్పించాలని కోరుతూ సోమవారం మంచిర్యాల జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌కు ఫోటోగ్రాఫర్లు వినతిపత్రం సమర్పించారు.

​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఫోటో, వీడియో గ్రాఫర్లకు సంబంధించి సుమారు రూ. 4 లక్షల బకాయిలు రావాల్సి ఉందని తెలిపారు. ఎన్నికలు ముగిసి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటివరకు తమకు పైసలు చెల్లించకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల తాము ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఉన్నతాధికారులు స్పందించి తమ ఆర్థిక పరిస్థితిని గుర్తించి వెంటనే బకాయిలు విడుదలయ్యేలా చూడాలని వారు కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో జక్కుల రాజు, కుమార్ తదితరులు ఉన్నారు.