BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 19 May 2026, 01:55 pm
Posted by : V శ్రీనివాస్

మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో గంజాయి రవాణాపై పోలీసుల ఉక్కుపాదం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
19 May, 2026 - 01:55 PM
140 వీక్షణలు

మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో గంజాయి రవాణాపై పోలీసుల ఉక్కుపాదం

మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో గంజాయి రవాణాను అరికట్టేందుకు పోలీసులు సోమవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. నార్కోటిక్ స్లీపర్ డాగ్ సహాయంతో రైల్వే బోగీలు, ప్రయాణికుల సామగ్రిని క్షుణ్ణంగా పరిశీలించారు. గంజాయి రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ ప్రమోద్ రావు హెచ్చరించారు.

పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్, డీసీపీ భాస్కర్ ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి వచ్చే రైళ్లలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, అనుమానాస్పద వస్తువుల కోసం శిక్షణ పొందిన నార్కోటిక్ స్లీపర్ డాగ్‌ను వినియోగించారు.

ఈ సందర్భంగా సీఐ ప్రమోద్ రావు మాట్లాడుతూ, మాదకద్రవ్యాల రవాణాను పూర్తిగా అరికట్టేందుకు పోలీసులు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాల గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

రైల్వే స్టేషన్లలో భద్రతను మరింత పటిష్టం చేసి, ప్రయాణికులకు సురక్షిత వాతావరణం కల్పించడం తమ ప్రధాన బాధ్యత అని అధికారులు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని వెల్లడించారు.

ఈ తనిఖీలలో సీఐ ప్రమోద్ రావుతో పాటు ఎస్సై మధుసూదన్, నార్కోటిక్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ ఆపరేషన్‌లో ఎటువంటి గంజాయి స్వాధీనం కాలేదని, అయితే అప్రమత్తత కోసం తనిఖీలు కొనసాగిస్తున్నామని అధికారులు తెలిపారు