BREAKING
thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు
Test 4
Date of Publish : 18 November 2026, 07:24 pm
Posted by : KADARI RAMANA

నిర్మల్‌లో భవనం నాలుగో అంతస్తు నుంచి దూకిన వివాహిత

తెలంగాణ
/ నిర్మల్
Reporter
Kadari Ramana నిర్మల్ నియోజకవర్గం
18 Nov, 2026 - 07:24 PM
21 వీక్షణలు

కుటుంబ కలహాలతో మనస్తాపం చెందినట్లు సమాచారం.. తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలింపు

నిర్మల్, నవంబర్ 18: కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఓ వివాహిత నిర్మల్ పట్టణంలోని నిర్మాణంలో ఉన్న భవనం నాలుగో అంతస్తు నుంచి దూకిన ఘటన బుధవారం కలకలం రేపింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన సంగీతకు రవితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యాభర్తల మధ్య కుటుంబ సమస్యలు, మనస్పర్థలు కొనసాగుతున్న నేపథ్యంలో సంగీత తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం.

ఈ క్రమంలో నిర్మల్ పట్టణంలోని శివాజీ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం నాలుగో అంతస్తుకు ఆమె చేరుకుంది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను కిందకు దించేందుకు ప్రయత్నించారు. సుమారు అరగంట పాటు ఆమెతో మాట్లాడి, ఆవేశపూరిత నిర్ణయం తీసుకోవద్దని నచ్చజెప్పారు. కొందరు స్థానికులు సైతం భవనం పైకి వెళ్లి ఆమెను రక్షించేందుకు ప్రయత్నించారు.

అయితే పోలీసులు, స్థానికులు ఎంతగా నచ్చజెప్పినా ఆమె కిందకు దూకినట్లు సమాచారం. వెంటనే స్పందించిన స్థానికులు, పోలీసులు ఆమెను అంబులెన్స్‌లో నిర్మల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో సంగీతకు రెండు కాళ్లు విరగడంతో పాటు తలకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్‌కు తరలించినట్లు తెలిసింది.

ఇద్దరు చిన్నారులు ఉన్న కుటుంబంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. కుటుంబ సమస్యలు ఎదురైనప్పుడు ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండి, పరస్పర చర్చలు, కుటుంబ పెద్దల సహకారంతో సమస్యలను పరిష్కరించుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.