BREAKING
స్టేషన్‌లోనే లంచం.. ఏసీబీ వలలో మహిళ ఎస్సై నందిత..! నూజివీడు కు గబ్బర్ సింగ్ రీ-ఎంట్రీ..! ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలి మోరంపూడి శ్రీనివాసరావు నల్లమల అంచున పెద్దపులి సంచారం కలకలం అడవిలో లంకెబిందెల కలకలం.. గిద్దలూరు అటవీ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాలపై సంచలనం అమెరికాలో అంబరాన్నంటిన శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె కుటుంబానికి గ్రామ బహిష్కరణ.. దళిత క్రైస్తవులు, ముస్లింలపై దాడులకు నిరసనగా విస్సన్నపేటలో వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీ ​నార్కట్‌పల్లిలో గంజాయి డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల అకస్మిక తనిఖీలు హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ గా బి కిషన్ స్టేషన్‌లోనే లంచం.. ఏసీబీ వలలో మహిళ ఎస్సై నందిత..! నూజివీడు కు గబ్బర్ సింగ్ రీ-ఎంట్రీ..! ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలి మోరంపూడి శ్రీనివాసరావు నల్లమల అంచున పెద్దపులి సంచారం కలకలం అడవిలో లంకెబిందెల కలకలం.. గిద్దలూరు అటవీ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాలపై సంచలనం అమెరికాలో అంబరాన్నంటిన శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె కుటుంబానికి గ్రామ బహిష్కరణ.. దళిత క్రైస్తవులు, ముస్లింలపై దాడులకు నిరసనగా విస్సన్నపేటలో వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీ ​నార్కట్‌పల్లిలో గంజాయి డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల అకస్మిక తనిఖీలు హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ గా బి కిషన్
www.ntodaynews.com

మత్స్యకారుల సేవలో ప్రభుత్వం అండగా.. బాపట్ల జిల్లాలో రూ.28.89 కోట్ల నిషేధ భృతి పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ బాపట్ల
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 May, 2026 - 05:27 PM
26 వీక్షణలు

బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లాస్థాయి “మత్స్యకారుల సేవలో” పథకం అమలు కార్యక్రమంలో వి. వినోద్ కుమార్, మద్దులూరి మాలకొండయ్యతో కలిసి వేగేశన నరేంద్ర వర్మ రాజు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాన్ని రాష్ట్రస్థాయిలో నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంట గ్రామంలో ప్రారంభించారు. అక్కడ జరిగిన కార్యక్రమాన్ని, ముఖ్యమంత్రి ప్రసంగ ప్రత్యక్ష ప్రసారాన్ని బాపట్లలోని పీజీఆర్ఎస్ హాలులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి తిలకించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రేపల్లె, చీరాల, బాపట్ల ప్రాంతాల్లో సముద్రంపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. సముద్రంలో చేపల వేట నిషేధ కాలంలో కుటుంబాల జీవనోపాధి దెబ్బతినకుండా “మత్స్యకార సేవ” పథకం ద్వారా ఆర్థిక భృతి అందిస్తున్నట్లు చెప్పారు.

పథకం కింద రేపల్లె నియోజకవర్గంలో 8,339 మంది, బాపట్లలో 1,855 మంది, చీరాలలో 3,032 మంది, పర్చూరులో 1,221 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.28.894 కోట్ల నిషేధ భృతి అందిస్తున్నట్లు వెల్లడించారు. మత్స్య సంపద, పర్యాటక రంగాల అభివృద్ధికి ప్రభుత్వం రీఫీల్డ్ రోడ్లు నిర్మిస్తోందని, భవిష్యత్తులో కోస్టల్ కారిడార్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.

మత్స్యకారులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వారి తరఫున పోరాడేందుకు సిద్ధంగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మత్స్యశాఖ సొసైటీలను బలోపేతం చేసుకోవాలని, సొసైటీల అభివృద్ధి ద్వారా ప్రభుత్వ గ్రాంట్లు సులభంగా అందుతాయని చెప్పారు. మత్స్యకారుల ఐక్యతే వారి అభివృద్ధికి ప్రధాన బలం అని పేర్కొన్నారు.

కార్యక్రమం అనంతరం జిల్లాలోని 14,447 మంది లబ్ధిదారులకు సంబంధించిన రూ.28 కోట్ల 89 లక్షల 40 వేల నిషేధ భృతి చెక్కును జిల్లా కలెక్టర్ వి. వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు మద్దులూరి మాలకొండయ్య, వేగేశన నరేంద్ర వర్మ రాజు కలిసి లబ్ధిదారులకు అందజేశారు.

ఇక బాపట్ల జిల్లాలో పర్యాటక రంగ ప్రోత్సాహానికి ప్రత్యేక లోగోతో గోని సంచులను మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాల ద్వారా తయారు చేసి విక్రయాలకు అందుబాటులో ఉంచుతున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీదేవి మహిళా పొదుపు సంఘం తయారు చేసిన గోని సంచులను బాపట్ల, చీరాల ఎమ్మెల్యేలకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్, అనగాని శివప్రసాద్, అగ్నికుల క్షత్రియ డైరెక్టర్ రామకృష్ణ, నగేష్, డెల్టా ప్రాజెక్టు మేనేజర్ పంతాని మురళి, మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ గాలి దేవుడు, మత్స్యశాఖ అధికారులు, మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు.