BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 03 August 2026, 08:48 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మ్యాజిక్‌లో ఉండేది సైన్స్ సూత్రాలే

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Aug, 2026 - 08:48 PM
61 వీక్షణలు

మ్యాజిక్‌లో ఉండేది సైన్స్ సూత్రాలే

తిరువూరు, ఆగస్టు 3: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏ.కొండూరు మండలం కంభంపాడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మూఢనమ్మకాల నిర్మూలనపై సైన్స్ సూత్రాల ఆధారంగా ఇంద్రజాల ప్రదర్శన నిర్వహించారు.

ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యుడు, ఇంద్రజాల నిపుణుడు వి. బాల బయ్యన్న మాట్లాడుతూ మ్యాజిక్ చేసే వారికి ఎలాంటి అతీంద్రియ శక్తులు ఉండవని, పూర్తిగా సైన్స్ సూత్రాలు, హస్తలాఘవం ఆధారంగానే ఇంద్రజాల ప్రదర్శనలు ఉంటాయని వివరించారు. కొందరు ఇదే హస్తలాఘవాన్ని ఉపయోగించి అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని, అలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి బి. రవి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్. గంగాధర్, ప్రధానోపాధ్యాయులు డి. శరత్ బాబు, కె. కొండలరావు, జిల్లా కార్యదర్శి ఎం. రాం ప్రదీప్, మండల ప్రధాన కార్యదర్శి ఎస్. రాం కుమార్, నాయకులు ఏ. రవీంద్ర, వి. తేజస్విని తదితరులు పాల్గొన్నారు.