ఓం చాముండేశ్వరి ఎగ్జిబిషన్ ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని, KUDA చైర్మన్…
వరంగల్: దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకొని వరంగల్ హంటర్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, KUDA చైర్మన్ గుండు సుధారాణి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం నిర్వాహకులు ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో ప్రజలను ఆకర్షించేలా, వారికి ఉపయోగపడే విధంగా ఎగ్జిబిషన్‌ను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లి చూడలేని ప్రముఖ దేవాలయాలు, ప్రత్యేక నిర్మాణాలు, వివిధ ప్రదర్శనలు, వినూత్న కార్యక్రమాలను వరంగల్‌లోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమన్నారు.
ఈసారి కూడా ఎగ్జిబిషన్‌ను చక్కగా, ఆకర్షణీయంగా రూపొందించారని ప్రశంసించారు. ప్రజలకు ఆహ్లాదంతో పాటు ప్రత్యేక అనుభూతిని కలిగించేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. ఎగ్జిబిషన్ విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మామిండ్ల రాజు, వేల్పుల మోహన్ రావు, డివిజన్ అధ్యక్షుడు సత్తు రమేష్, మాజీ అధ్యక్షుడు సురేందర్, నాయకులు సురేష్, వరుణ్, వేణు, నిర్వాహకుడు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.