BREAKING
thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు
Test 4
Date of Publish : 18 November 2026, 06:43 pm
Posted by : SEETHA KIRAN KUMAR

గ్రేటర్ వరంగల్‌లో డ్రోన్లతో దోమల నివారణ మందుల పిచికారీ

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
18 Nov, 2026 - 06:43 PM
14 వీక్షణలు

66 డివిజన్లలో దశలవారీగా కార్యక్రమం విస్తరణకు కమిషనర్ ఆదేశాలు

వరంగల్ (ఎన్ టుడే న్యూస్): గ్రేటర్ వరంగల్ నగరంలో దోమల వ్యాప్తిని నియంత్రించి ప్రజారోగ్యాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా డ్రోన్ల ద్వారా క్రిమిసంహారక మందుల పిచికారీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నయీంనగర్‌లోని రాజాజీ నాలా వద్ద నగరపాలక సంస్థ కమిషనర్ టి. వెంకన్న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

పారిశుద్ధ్య సిబ్బంది చేరుకోలేని లోతైన నాలాలు, మురుగునీటి ప్రవాహాలు, నీరు నిల్వ ఉండే ప్రమాదకర ప్రాంతాల్లో ఆధునిక డ్రోన్ల సాయంతో సమర్థవంతంగా మందులు పిచికారీ చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమాన్ని నగరంలోని 66 డివిజన్లలో దశలవారీగా విస్తరించాలని సూచించారు. మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల నివారణకు దోమల ఉత్పత్తి కేంద్రాలను గుర్తించి నిరంతరం పర్యవేక్షించాలని, ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.