BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
Date of Publish : 30 December 2025, 11:07 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ధర్మపురిలో వైభవంగా ముక్కోటి ఏకాదశి

తెలంగాణ
30 Dec, 2025 - 11:07 AM
199 వీక్షణలు

ధర్మపురిలో వైభవంగా ముక్కోటి ఏకాదశి

NTODAY NEWS: గొల్లపల్లి మండలం రిపోర్టర్ లక్షణ్ ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్న కొప్పుల ఈశ్వర్ దంపతులు వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి) పర్వదినాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం భక్తజన సంద్రమైంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆయన సతీమణి స్నేహలతతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్తర ద్వార దర్శనం – ప్రత్యేక పూజలు ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ధర్మపురి క్షేత్రంలోని ఉత్తర ద్వారం గుండా లక్ష్మీనరసింహ స్వామిని కొప్పుల ఈశ్వర్ దంపతులు దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, తీర్థప్రసాదాలు అందజేశారు. పాల్గొన్న ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో కొప్పుల ఈశ్వర్ దంపతులతో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. జిల్లా తొలి జడ్పీ ఛైర్‌పర్సన్ దావ వసంత – సురేష్ దంపతులు, మాజీ మార్క్‌ఫెడ్ ఛైర్మన్ లోక బాపు రెడ్డి, మాజీ డీసీఎంఎస్ ఛైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ జడ్పీ వైస్ ఛైర్మన్ హరిచరణ్ రావు, ధర్మపురి మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ సంగి సత్తెమ్మ, ఇందారపు రామన్న, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్లు అయ్యోరి రాజేష్, కృష్ణ రెడ్డి, శీలం ప్రవీణ్, నాగేశ్వర్ రావు బీఆర్‌ఎస్ నాయకులు బుర్ర ప్రవీణ్ గౌడ్, తుమ్మ గంగాధర్, మహేందర్ రెడ్డి, రంజిత్, చిట్ల రమణ, మల్లేశం, శేఖర్, మహేష్, శ్యామ్, విజయతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, స్వామివారి కృపతో రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించినట్లు తెలిపారు. Follow us on Website Facebook Instagram YouTube