www.ntodaynews.com
నాలుగేళ్లుగా మైనర్లపై దారుణం.. ఫోన్లో 600కు పైగా వీడియోలు
జాతీయం
నందుర్బార్: మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలో మైనర్లు, యువకులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న 22 ఏళ్ల చేతన్ ప్రకాశ్ కోలీని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి మొబైల్ ఫోన్లో 600కు పైగా అసభ్యకర వీడియోలను గుర్తించినట్లు జిల్లా ఎస్పీ వెల్లడించారు.
డబ్బు ఆశ చూపి మైనర్లను తనకు లోబర్చుకునేవాడని, అనంతరం వారి వీడియోలను చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేసేవాడని పోలీసులు తెలిపారు. గత నాలుగేళ్లుగా నిందితుడు ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని పేర్కొన్నారు.
నిందితుడి ఫోన్లో లభించిన వీడియోల ఆధారంగా మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతూ, ఈ ఘటనకు సంబంధించి మరెవరైనా ఉన్నారా అనే కోణంలోనూ విచారణ కొనసాగిస్తున్నారు.