BREAKING
thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం
Date of Publish : 20 September 2026, 08:16 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలనులో లోకం సుభిక్షంగా ఉండాలని నగర సంకీర్తన

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Sep, 2026 - 08:16 AM
30 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం మండలం, పెనుగొలను: లోకం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని కాంక్షిస్తూ పెనుగొలను గ్రామంలో ఆదివారం సత్యసాయి సేవా కమిటీ ఆధ్వర్యంలో నగర సంకీర్తన నిర్వహించారు. శివాలయం ప్రాంగణంలోని శిరిడి సాయిబాబా మందిరం నుంచి భక్తులు బయలుదేరి గ్రామంలోని ప్రధాన వీధుల మీదుగా నామస్మరణ చేస్తూ సంకీర్తన నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ‘ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి’, ‘శ్రీరామ జయరామ జయజయరామ’ నామాలను పారాయణం చేశారు. కార్యక్రమంలో సత్యసాయి సేవా కమిటీ సభ్యులు డాక్టర్ జి. నరసింహారావు, సుగ్గల హనుమంతరావు, పారేపల్లి కృష్ణారావుతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

పెనుగొలనులో హనుమాన్ చాలీసా పారాయణం

పెనుగొలను గ్రామంలోని బొడ్రాయి సెంటర్ వద్ద ఉన్న అభయాంజనేయ స్వామి ఏకశిలా విగ్రహం వద్ద శనివారం రాత్రి భక్త బృందం ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం, భజన కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు హనుమాన్ చాలీసాను పారాయణం చేసి భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ బండారు గోపి ఆర్థిక సహకారంతో వివిధ రకాల ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. కార్యక్రమ ఏర్పాట్లను నిర్వాహకులు బొలగాని నాగయ్య, కోట దాసు, పసుమర్తి లక్ష్మణరావు, పాశం వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు.