BREAKING
పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?...
Date of Publish : 20 July 2026, 04:30 pm
Posted by : V శ్రీనివాస్

​నస్పూర్ యూనియన్ బ్యాంక్ ఎదుట సింగరేణి విశ్రాంత ఉద్యోగుల నిరసన

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
20 Jul, 2026 - 04:30 PM
397 వీక్షణలు

​​నస్పూర్ యూనియన్ బ్యాంక్ ఎదుట సింగరేణి విశ్రాంత ఉద్యోగుల నిరసన

నస్పూర్ (మంచిర్యాల): ఎస్‌బీఐ (SBI) తరహాలోనే యూనియన్ బ్యాంకులో ఖాతాలున్న సింగరేణి కోల్ మైన్స్ పెన్షనర్లకు రూ.50 లక్షల ప్రమాద బీమా, సహజ మరణానికి రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం నస్పూర్ యూనియన్ బ్యాంక్ ఎదుట సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. 70 ఏళ్లలోపు ఖాతాదారులకు బీమా వర్తింపుపై ఒప్పంద పత్రాలలో స్పష్టత లేదని నాయకులు పేర్కొన్నారు. దీనిపై పత్రికలు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పెన్షనర్లకు పూర్తి వివరణ ఇవ్వాలని కోరుతూ బ్రాంచ్ మేనేజర్ బోగే సాగర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని, సింగరేణి విశ్రాంత ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలని కోరుతూ పెద్దపెట్టున నినాదాలు చేశారు.

​ఈ నిరసన కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, కోశాధికారి బింగి రాజేశం, కార్యదర్శి ఎన్నం శంకర్, ఆర్గనైజర్ తణుకుల మోహన్, జిల్లా ఏరియా నాయకులు సంగెం రాంచందర్, మేడ రాజలింగు, టీ.శ్రీహరి, ఎన్.సదాశివ, ఎండి.ఖాదర్, హుస్సేన్, ఇ.రాజనర్సు, రేకుల పర్వతాలు, బి.ఒదయ్య, ఎస్డీ.అబ్బాస్ అలీ, బాజీ రెడ్డి సురేష్, అర్వ మల్లయ్య, ఇరుకుల జనార్దన్, పి.లక్ష్మయ్య, కె.పోచయ్య, ఎస్.బాణయ్య, కె.దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు