BREAKING
బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు
Date of Publish : 25 July 2026, 08:23 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఊటుకూరులో గ్రోమోర్ కేంద్రంపై ఆర్డీవో ఆకస్మిక తనిఖీ యూరియా పంపిణీని పరిశీలించి రైతులకు సూచనలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Jul, 2026 - 08:23 PM
73 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం ఊటుకూరు గ్రామంలోని గ్రోమోర్ కేంద్రాన్ని తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ. కుమార్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులకు యూరియా పంపిణీ జరుగుతున్న తీరును పరిశీలించి, సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

యూరియా పంపిణీలో ఎలాంటి అవకతవకలు, అక్రమాలు లేదా నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే రైతులకు ఎరువులు విక్రయించాలని నిర్వాహకులకు ఆదేశించారు. అనంతరం కేంద్రానికి వచ్చిన రైతులకు యూరియాను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ, ఎల్‌నీనో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని నీటి లభ్యత తగ్గిన నేపథ్యంలో రైతులు నీటి వినియోగం తక్కువగా ఉండే ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగించుకుంటూ పంటల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు అవగాహన కల్పించారు.

ప్రభుత్వ సూచనలను పాటిస్తూ వ్యవసాయ కార్యకలాపాలు కొనసాగించాలని, రైతులకు అవసరమైన ఎరువులు పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆర్డీవో ఆదేశించారు.