BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 14 August 2026, 12:36 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలను గ్రామంలో ఘనంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Aug, 2026 - 12:36 PM
142 వీక్షణలు

పెనుగొలను గ్రామంలో ఘనంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు

జాతీయ జెండాతో విద్యార్థుల ప్రదర్శనలు.. దేశభక్తి చాటిన చిన్నారులు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో పలుచోట్ల హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.

పెనుగొలను కోట మార్కండేయ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు చేతుల్లో జాతీయ జెండాలు పట్టుకొని పాఠశాల ప్రాంగణంలో ప్రదర్శన నిర్వహించారు. ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. దుర్గాప్రసాద్ మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రను ప్రతి పౌరుడికి తెలియజేసి వారిలో దేశభక్తి, ఐక్యత భావాలను పెంపొందించడమే హర్ ఘర్ తిరంగా కార్యక్రమం లక్ష్యమని తెలిపారు.

సాయిబాబా కమిటీ ఆర్గనైజర్ వెదురు వెంకటరెడ్డి మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా లభించిన స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సాయిబాబా కమిటీ అధ్యక్షులు వూటుకూరు నారాయణరావు మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న పలువురు నాయకుల సేవలు కొన్ని కారణాల వల్ల చరిత్రలో మరుగున పడిపోయాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అదేవిధంగా పెనుగొలను ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో కూడా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కే. యోహాను మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల స్ఫూర్తితో విద్యార్థులు దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కే. లీలా శంకర్, కే. సుజాత, ఎం. మాణిక్యం, జి. అలేఖ్య, కాన్వెంట్ ప్రిన్సిపాల్ తోట నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

పెనుగొలను 99వ అంగన్వాడీ కేంద్రంలో కూడా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ టీచర్ కే. లింగమ్మ మాట్లాడుతూ దేశం స్వాతంత్ర్యం సాధించి 80 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ నాగమణి, సిబ్బంది అంజలి, చిన్నారులు పాల్గొన్నారు.