BREAKING
thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● పూలను దేవతలుగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకే ప్రత్యేకం thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● పూలను దేవతలుగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకే ప్రత్యేకం thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు..
Date of Publish : 25 August 2026, 07:14 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలను హైస్కూల్లో ముగిసిన రెండో దశ జ్ఞాన జ్యోతి శిక్షణ శిబిరం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Aug, 2026 - 07:14 PM
131 వీక్షణలు

అంగన్వాడీ కార్యకర్తలకు బాలల వికాసంపై అవగాహన

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు: గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని కోట మార్కండేయ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మూడు రోజులుగా నిర్వహించిన రెండో దశ "జ్ఞాన జ్యోతి" శిక్షణ శిబిరం మంగళవారం ముగిసింది.

అంగన్వాడీ కార్యకర్తలకు మొదటి దశ శిక్షణ ఆగస్టు 11 నుంచి 13 వరకు, రెండో దశ శిక్షణ ఆగస్టు 22 నుంచి 25 వరకు నిర్వహించారు. ఈ శిక్షణలో అంగన్వాడీ చిన్నారులకు సులభంగా అర్థమయ్యే విధంగా బోధించే పద్ధతులు, బాలల మేధో వికాసానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు అవగాహన కల్పించారు.

చిన్నారుల్లో చదువుపై ఆసక్తి పెంచే విధానాలు, ఆటల ద్వారా నేర్పించే పద్ధతులు, వయసుకు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించే విధానాలను వివరించారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులు ఉత్సాహంగా ఉండేలా వివిధ రకాల ఆటలు, సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

మంగళవారం జరిగిన ముగింపు కార్యక్రమంలో సీడీపీవో పీ. కృష్ణకుమారి మాట్లాడుతూ అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేయడంతో పాటు 0 నుంచి 6 సంవత్సరాల వయసు గల బాలల సమగ్ర వికాసానికి ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

శిక్షణలో నేర్చుకున్న అంశాలను అంగన్వాడీ కార్యకర్తలు ఆచరణలో పెట్టి కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించి మంచి గుర్తింపు తీసుకురావాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ ఏ. చైతన్యభవాని, శిక్షకులు కాంతారావు, మురళీకృష్ణ, కిరణ్మయి, వివిధ అంగన్వాడీ కేంద్రాలకు చెందిన కార్యకర్తలు పాల్గొన్నారు.