BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 01 August 2026, 03:20 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలనులో ఘనంగా లోకమాన్య బాలగంగాధర తిలక్ వర్ధంతి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Aug, 2026 - 03:20 PM
86 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో శనివారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో లోకమాన్య బాలగంగాధర తిలక్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తిలక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సాయిబాబా యూత్ కమిటీ అధ్యక్షుడు వూటుకూరు యజ్ఞ కృష్ణ మాట్లాడుతూ, లోకమాన్య బాలగంగాధర తిలక్ 1856 జూలై 23న మహారాష్ట్రలోని రత్నగిరిలో జన్మించారని తెలిపారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక నాయకుడిగా నిలిచిన తిలక్ "స్వరాజ్యం నా జన్మహక్కు, దానిని సాధించి తీరుతాను" అనే నినాదంతో దేశ ప్రజల్లో జాతీయ చైతన్యాన్ని రగిలించారని చెప్పారు. హిందువుల్లో ఐక్యత పెంపొందించేందుకు ఛత్రపతి శివాజీ జయంతి, గణేశ్ ఉత్సవాలను బహిరంగంగా నిర్వహించే సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన మహనీయుడిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు.

మహిళా కమిటీ ఆర్గనైజర్ దేవర అంజలి మాట్లాడుతూ, స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నందుకు బ్రిటిష్ ప్రభుత్వం తిలక్‌ను బర్మాలోని మాండలే జైలుకు పంపిందని తెలిపారు. అక్కడే ఆయన ప్రసిద్ధ గ్రంథం 'గీతా రహస్యం' రచించారని చెప్పారు. 1920 ఆగస్టు 1న ముంబైలో తీవ్ర అనారోగ్యంతో తిలక్ కన్నుమూశారని పేర్కొంటూ, దేశ స్వాతంత్ర్యానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.

కార్యక్రమంలో విద్యార్థులు, అంగన్వాడీ చిన్నారులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని లోకమాన్య బాలగంగాధర తిలక్‌కు ఘనంగా నివాళులర్పించారు.