BREAKING
thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన..
Date of Publish : 04 August 2026, 12:04 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలనులో కరుణశ్రీ 114వ జయంతి వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Aug, 2026 - 12:04 PM
120 వీక్షణలు

పెనుగొలనులో కరుణశ్రీ 114వ జయంతి వేడుకలు

గంపలగూడెం, ఆగస్టు 4: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, ప్రముఖ కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి (కరుణశ్రీ) 114వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో విశ్రాంత ప్రిన్సిపాల్ వెదురు వెంకటరెడ్డి మాట్లాడుతూ, 1912 ఆగస్టు 4న గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొమ్మూరు గ్రామంలో జన్మించిన జంధ్యాల పాపయ్య శాస్త్రి 20వ శతాబ్దపు ప్రముఖ తెలుగు కవుల్లో ఒకరని తెలిపారు. సులభమైన శైలి, సమకాలీన భావజాలం, చక్కటి తెలుగు నుడికారంతో ఆయన రచనలు పాఠకులను విశేషంగా ఆకట్టుకున్నాయని చెప్పారు.

ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు కే. సుజాత మాట్లాడుతూ, ఖండకావ్యాల రచనలో జంధ్యాల పాపయ్య శాస్త్రి విశిష్ట స్థానాన్ని సంపాదించారని, కరుణరస ప్రధానంగా ఎన్నో రచనలు చేసి "కరుణశ్రీ"గా చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన రచించిన ఉదయశ్రీ, కరుణశ్రీ, విజయశ్రీ, కుంతీకుమారి, పుష్పవిలాపం వంటి కావ్యాలు తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచాయని వివరించారు.

శిరిడి సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు మాట్లాడుతూ, తెలుగు సాహిత్యానికి చేసిన విశిష్ట సేవలకు గాను జంధ్యాల పాపయ్య శాస్త్రి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారంతో పాటు తెలుగు అకాడమీ, అభినందన, రసమయి, శుభాంగి పురస్కారాలను అందుకున్నారని తెలిపారు. పద్యం, వచనం, గేయం వంటి విభిన్న ప్రక్రియల్లో 76కుపైగా రచనలు చేసి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారని కొనియాడారు.

కార్యక్రమం సందర్భంగా శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ఐదో తరగతి విద్యార్థులకు పరీక్షల కోసం ఎగ్జామ్ ప్యాడ్లను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో కాన్వెంట్ ప్రిన్సిపాల్ తోట నాగరాజు, ఉపాధ్యాయులు ఎస్. శంకర్, ఆర్. మాణిక్యమ్మ, జి. అలేఖ్య, డి. బేబీ, విద్యార్థులు పాల్గొన్నారు.