BREAKING
వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం
Date of Publish : 26 July 2026, 04:41 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పోతనపల్లి గ్రామంలో నాటు సారాపై ఎక్సైజ్ దాడులు.. ఐదు లీటర్ల నాటు సారా స్వాధీనం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jul, 2026 - 04:41 PM
88 వీక్షణలు

చాట్రాయి మండల రిపోర్టర్ గోళ్ళ సత్యనారాయణ 

చాట్రాయి: నూజివీడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఏలూరు జిల్లా డిప్యూటీ కమిషనర్ బి. శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ కే. నాగ ప్రభు కుమార్, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఎ. అవులయ్య ఆదేశాల మేరకు ప్రభుత్వం చేపట్టిన నవోదయం–2.0 కార్యక్రమంలో భాగంగా చాట్రాయి మండలం పోతనపల్లి పెద్దతండా గ్రామంలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో బానవతు రాము వద్ద నుంచి 5 లీటర్ల నాటు సారాతో పాటు హీరో హోండా ప్యాషన్ మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకుని, అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ ఏ. మస్తానయ్య తెలిపారు.

ఈ సందర్భంగా ఎక్సైజ్ అధికారులు మాట్లాడుతూ నూజివీడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ఆగిరిపల్లి, నూజివీడు, ముసునూరు, చాట్రాయి మండలాల్లో బెల్ట్ షాపులు నిర్వహించే వారిపై, నాటు సారా తయారీ, విక్రయం, నిల్వకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అలాగే నాటు సారా తయారీకి బెల్లం సరఫరా చేసే వ్యాపారులు, బెల్లపు ఊటలు ఏర్పాటు చేసిన భూ యజమానులపై కూడా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. అక్రమ మద్యం తయారీ, విక్రయాలకు సంబంధించిన సమాచారం 9440902462 నంబర్‌కు అందిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ మస్తానయ్య తెలిపారు.