BREAKING
పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?...
Date of Publish : 20 July 2026, 08:17 pm
Posted by : కూనురు మధు

​ప్రభుత్వ భూముల ఆక్రమణలపై కలెక్టరేట్ లో ఫిర్యాదు

తెలంగాణ
20 Jul, 2026 - 08:17 PM
319 వీక్షణలు

​ప్రభుత్వ భూముల ఆక్రమణలపై కలెక్టరేట్ లో ఫిర్యాదు  

యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం నీర్నేముల గ్రామంలోని ప్రభుత్వ భూములు, చెరువు గర్భం, కుంటల శిఖం  భూముల ఆక్రమణలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామ బాధ్యతాయుత పౌరులు, గ్రామస్తులు సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన 'ప్రజావాణి' కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు పత్రం సమర్పించారు. ​ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ నీర్నేముల గ్రామంలో పబ్లిక్ భూములు, చెరువు శిఖం స్థలాలు రోజురోజుకూ అక్రమ ఆక్రమణలకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో తహసీల్దార్ ) జారీ చేసిన అధికారిక ఉత్తర్వులు (Endt.No.D/470/2026) ఉన్నప్పటికీ, అలాగే పత్రికల్లో విస్తృతంగా వార్తలు వచ్చినప్పటికీ నేటికీ క్షేత్రస్థాయిలో ఎలాంటి ఉమ్మడి సర్వే లేదా కబ్జాల తొలగింపు చర్యలు చేపట్టలేదని తెలిపారు. ​అధికారుల అలసత్వాన్ని ఆసరాగా చేసుకొని అక్రమార్కులు విచ్చలవిడిగా చెరువు శిఖం భూములను కబ్జా చేసి, పంటలు పండిస్తూ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. గ్రామస్తుల ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన జిల్లా కలెక్టర్, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ మరియు ఇరిగేషన అధికారులను ఆదేశించారు.


​భావితరాల భవిష్యత్తు , పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ఈ ఉమ్మడి పబ్లిక్ భూములు ఎంతో కీలకమని, అధికారులు వెంటనే క్షేత్రస్థాయి సర్వే నిర్వహించి అక్రమ ఆక్రమణలను తొలగించాలని ఈ సందర్భంగా గ్రామస్తులు కోరారు.