BREAKING
thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV
Date of Publish : 09 May 2026, 06:25 am
Posted by : ఇప్పలపల్లి నరేందర్

ప్రభుత్వం రైతులను ఇబ్బందులు చేయకుండా మండలంలోని వరి ధాన్యం కొనుగోలు వేగం పెంచాలి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బొమ్మలరామారం
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
09 May, 2026 - 06:25 AM
234 వీక్షణలు

ప్రభుత్వం రైతులను ఇబ్బందులు చేయకుండా మండలంలోని వరి ధాన్యం కొనుగోలు వేగం పెంచాలి--సిపిఎం మండల కార్యదర్శి ర్యాకల శ్రీశైలం 

వరి ధాన్యం పండించిన రైతుకు ప్రతి సీజన్లో తిప్పలు తప్పడం లేదు అని బొమ్మలరామారం సిపిఎం మండల కార్యదర్శి ర్యాకల శ్రీశైలం అన్నారు మండలంలోని వరి ధాన్యం కొనుగోలు సెంటర్ లో ఉన్న ధాన్యాన్ని మండల కమిటీ ఆధ్వర్యంలో పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకవైపు ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయకపోవడం మరోవైపు మిల్లర్లు 40 కిలోలు కాదు 42 కిలోలు తూకం వేయడం రైతుల్ని నిట్టనిలువునా దోపిడీ చేస్తున్న పరిస్థితి మండలంలో  కొనసాగుతున్నది అని అన్నారు వరి ధాన్యము కొనుగోలు సెంటర్లో లోడ్ అయిన  ధాన్యం మిల్లుకు వెల్లి రోజులతరబడి మిల్లుల వద్ద పడి కాపులు కాయడం చివరికి మిల్లర్ల  దయాదాక్షిన్యాల మీద అన్లోడ్ అవుతున్న పరిస్థితి ఉన్నది అని అన్నారు ఇంత జరుగుతున్నా జిల్లా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు.జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలను కూడా మిల్లర్లు బేఖాతారు చేస్తున్న పరిస్థితి నెలకొన్నది అని అన్నారు. ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేదొకటిగా మరొకటి అని అన్నారు. కేవలం పత్రికా ప్రకటనలు చేస్తూ మంత్రులు, ఎంఎల్ ఏ లు కాలయాపన చేస్తున్నారు అని అన్నారు. రైతులను ఇబ్బంది పెట్టడం  ఏమాత్రం సరైనది కాదు అని అన్నారు. ప్రభుత్వం వెంటనే అదనంగా కాంటాలు, లారీలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి అని అన్నారు. వేసవికాలం మండుటెండల్లో రైతులు మార్కెట్లో ఉండి వడదెబ్బకు గురి అవుతూ తీవ్ర అనారోగ్యం పాలవుతున్న కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు ఈ  కార్యక్రమంలో మసిరెడ్డిపల్లి సర్పంచ్ నోముల రాంరెడ్డి, మండల కమిటీ సభ్యులు ముక్యర్ల పున్నమ్మ,నాయకులు ప్యారారం నరసింహ,  ఎల్లమైన వెంకటేష్, ఎల్లబోయిన సాయికుమార్, జల శ్రీనివాస్, కుశంగల అంజమ్మ, పండుగ కుమార్, నోముల కొండల్ రెడ్డి, సిద్దంకి లక్ష్మి, పండుగ రాములు, తోటకూర కిష్టమ్మ తదితరులు పాల్గొన్నారు