BREAKING
thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి thumb ● యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి thumb ● యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ
Date of Publish : 23 June 2026, 07:48 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 07:48 AM
160 వీక్షణలు

హైదరాబాద్, జూన్ 23: తెలంగాణలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం అవుతోందని ఆరోపిస్తూ విద్యార్థి సంఘం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చింది.

ఏబీవీపీ ఇచ్చిన బంద్‌ పిలుపు నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రైవేటు పాఠశాలలు ముందస్తుగా సెలవు ప్రకటించాయి. ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు మొబైల్ సందేశాల ద్వారా తెలియజేశాయి. బంద్ కారణంగా మంగళవారం పాఠశాలకు సెలవు ప్రకటించినట్లు సందేశాల్లో పేర్కొన్నాయి.

విద్యా రంగానికి సంబంధించిన వివిధ సమస్యలపై ప్రభుత్వ దృష్టిని ఆకర్షించేందుకు ఈ బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఏబీవీపీ నేతలు తెలిపారు. బంద్ ప్రభావంతో పలు ప్రాంతాల్లో విద్యా కార్యకలాపాలు నిలిచిపోయే అవకాశం ఉంది. తల్లిదండ్రులు, విద్యార్థులు తమకు సంబంధించిన పాఠశాలల నుంచి వచ్చిన అధికారిక సమాచారాన్ని పరిశీలించాలని సూచిస్తున్నారు.