BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 23 May 2026, 01:16 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రపంచ తాబేలు దినోత్సవం సందర్భంగా ప్రకృతి పరిరక్షణకు పిలుపు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 May, 2026 - 01:16 PM
159 వీక్షణలు

ప్రపంచ తాబేలు దినోత్సవం సందర్భంగా ప్రకృతి పరిరక్షణకు పిలుపు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలనులో శనివారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో “ప్రపంచ తాబేలు దినోత్సవం” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రకృతి సమతుల్యతను కాపాడడంలో తాబేళ్ల పాత్ర ఎంతో కీలకమని, వాటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని నిర్వాహకులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సాయిబాబా కమిటీ అధ్యక్షులు వూటుకూరు నారాయణరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మే 23న ప్రపంచవ్యాప్తంగా తాబేలు దినోత్సవాన్ని నిర్వహిస్తూ తాబేళ్ల మనుగడపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. చెరువులు, నదుల్లో పెరిగే కీటకాలు, పాచిని తినడం ద్వారా తాబేళ్లు జలవనరులను శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతున్నాయని వివరించారు.

అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా నీటి వనరులను కలుషితం కాకుండా కాపాడాలని, జీవ వైవిధ్యాన్ని సంరక్షించడం ద్వారానే భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన ప్రకృతిని అందించగలమని సూచించారు.

ఈ కార్యక్రమంలో మహిళా మండలి సభ్యులు, విద్యార్థులు, గ్రామస్థులు ఉత్సాహంగా పాల్గొని తాబేళ్ల సంరక్షణపై ప్రతిజ్ఞ చేశారు.