BREAKING
thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● మర్రిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● మర్రిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు
Date of Publish : 07 July 2026, 04:50 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బీసీ కమిషన్ చైర్మన్‌కు కల్లుగీత కార్మికుల వినతి.. కార్పొరేషన్ ఏర్పాటు, ఎక్స్‌గ్రేషియా అమలుకు డిమాండ్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Jul, 2026 - 04:50 PM
113 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రాను ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం నాయకులు కలిసి గీత కార్మికుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు వాకా వెంకటేశ్వరావు గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా కల్లుగీత ఆర్థిక సహకార సంస్థ (కార్పొరేషన్) ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే గతంలో అమలులో ఉన్న కల్లుగీత కార్మికుల ఎక్స్‌గ్రేషియా భీమా పథకాన్ని 2018 నుంచి 2026 వరకు కొనసాగించి, అర్హులైన కుటుంబాలకు వెంటనే వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.

గీత కార్మికుల జీవన భద్రత, ఉపాధి పరిరక్షణ, సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతూ పలు సమస్యలను వివరించిన మెమోరాండంను కమిషన్ చైర్మన్‌కు అందజేశారు.

ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం నాయకులు పంది వెంకట్రావు, వడ్డేబోయిన జానకిరామ్, వడ్డేబోయిన శ్రీను, మోటపోతుల చిన్న లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.