BREAKING
అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE గ్రామ సచివాలయ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేత గోవర్ధన్ రెడ్డి పుంగనూరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE గ్రామ సచివాలయ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేత గోవర్ధన్ రెడ్డి పుంగనూరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ
Date of Publish : 22 July 2026, 08:40 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పర్వతాపురం–కోటపాడు రోడ్డులో భయంకరమైన గోతులు.. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమా?

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jul, 2026 - 08:40 AM
91 వీక్షణలు

పర్వతాపురం–కోటపాడు రోడ్డులో భయంకరమైన గోతులు.. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమా?

ఏలూరు జిల్లా చాట్రాయి మండలం పర్వతాపురం–కోటపాడు ప్రధాన రహదారి ప్రస్తుతం గోతుల రహదారిగా మారిపోయింది. చిన్నంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, నిత్యం ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. గ్రామంలోని శివపురం రోడ్డు సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద నుంచి రహదారి పూర్తిగా దెబ్బతిని భారీ గోతులతో ప్రమాదకరంగా మారింది.

తారు రోడ్డు కనిపించకుండా వరుసగా ఏర్పడిన గోతులు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ఎప్పుడు ఏ గోతిలో పడతామోనన్న భయంతో ప్రయాణించాల్సి వస్తోంది. రాత్రి వేళల్లో పరిస్థితి మరింత దారుణంగా మారి ప్రమాదాలకు నిలయంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బస్సు ప్రయాణికుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. గోతులపై నుంచి బస్సులు దూసుకెళ్లడంతో ప్రయాణం నరకప్రాయంగా మారిందని ప్రయాణికులు వాపోతున్నారు. వృద్ధులు, మహిళలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలువురు వాహనదారులు చిన్నపాటి ప్రమాదాలకు గురయ్యారని స్థానికులు చెబుతున్నారు.

ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు ఈ రహదారిపై ఒక్కసారి ప్రయాణిస్తే సమస్య తీవ్రత అర్థమవుతుందని గ్రామస్తులు అంటున్నారు. ప్రమాదం జరిగి ప్రాణాలు పోయిన తర్వాత స్పందించే బదులు ఇప్పటికైనా వెంటనే మరమ్మతులు చేపట్టి గోతులను పూడ్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.