BREAKING
బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు
Date of Publish : 25 July 2026, 11:32 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పుంగనూరులో స్వచ్ఛ భారత్ - స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం* లో *జనసేన నాయకుడు రాయల్ కుమార్..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
25 Jul, 2026 - 11:32 PM
39 వీక్షణలు

పుంగనూరులో స్వచ్ఛ భారత్ - స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో జనసేన నాయకుడు రాయల్ కుమార్..

అన్నమయ్య జిల్లా.పుంగనూరు 

పుంగనూరు మున్సిపాలిటీ పరిధిలో స్వచ్ఛ భారత్ మరియు స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు వాల్ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది.

పుంగనూరు మున్సిపల్ కమిషనర్ కె. మధుసూదన్ రెడ్డి చేతుల మీదుగా ఈ పోస్టర్‌ను పుంగనూరు సీనియర్ జనసేన నాయకుడు *రాయల్ కుమార్* ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వ్యర్థాలు, థర్మకోల్ మరియు సింథటిక్ పదార్థాలు వాడకం వల్ల మనకు తెలియకుండానే ఆహారం ద్వారా శరీరంలోకి చేరి ప్రాణహానికి దారితీస్తాయని తెలిపారు.

జనసేన నాయకుడు రాయల్ కుమార్ మాట్లాడుతూ, నిత్యం ఆహార ప్యాకింగ్ కోసం మరియు హోటళ్లలో వాడే ప్లాస్టిక్ ప్లేట్లు, స్పూన్లు వేడికి కరిగి మైక్రోప్లాస్టిక్స్ రూపంలో మనం తినే ఆహారంలో కలిసిపోతున్నాయని, దీనివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని గుర్తుచేశారు.

హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు మరియు టీ స్టాళ్లలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, దానికి ప్రత్యామ్నాయంగా అరటి ఆకు లేదా విస్తరాకు వాడాలని ఆయన కోరారు. ముఖ్యంగా పానీపూరీ వ్యాపారులు థర్మాకోల్ మరియు ప్లాస్టిక్ స్పూన్ల వాడకాన్ని పూర్తిగా తగ్గించాలని మరీ మరీ కోరారు.

ప్రతి హోటల్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మరియు టీ స్టాల్‌లో ఈ వాల్ పోస్టర్‌ను తప్పనిసరిగా అతికించాలని కమిషనర్ మధుసూదన్ రెడ్డి సూచించారు. నిబంధనలు పాటించని వారికి ₹5,000 నుండి ₹25,000 వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాయల్ కుమార్ తో పాటుగా జనసేన నాయకులు జనార్దన్ రాయల్, టి. శ్రీనివాసులు, ఎన్. దినేష్ రాయల్, ఎన్. పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.